Back to Home
Watermark
ఆదివారం, 18 అక్టోబర్, 2026 TIME : 08:16 PM

మానకొండూర్ మండలం వన్నారంలో ఉద్రిక్తత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బుద్ధుడి చిత్రపటాలు ఉన్న సూచిక బోర్డు ధ్వంసం!

Main Image

మహారాజుల కాలనీ సూచిక బోర్డును మరుగు కాలువలో పడేసి అవమానించిన వైనం

కులవివక్షకు పాల్పడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ యువజన సంఘం ఆగ్రహం

మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామం నది ఒడ్డులోని భూలక్ష్మి చౌరస్తా దగ్గర ఉన్న మహారాజుల కాలనీ సూచిక బోర్డును అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా తొలగించి మరుగు కాలువలో పడవేసి తొక్కడం తీవ్ర కలకలం రేపింది. ఆ సూచిక బోర్డు పైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మరియు బుద్ధుని ఫోటో చిహ్నాలు ఉండగా, వాటిని కింద పడవేసి అగౌరవపరిచారని గ్రామ యువజన సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా వారు మండిపడ్డారు.

Additional Image

గ్రామంలో "మీరు తక్కువ కులం" అంటూ దూషిస్తూ కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని, ఇలాంటి అసాంఘిక చర్యల వల్ల గ్రామంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం కలుగుతోందని బాధితులు, యువజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో భాకరపు తిరుపతి (మాజీ సర్పంచ్), భాకరపు హరీష్, భాకరపు రాములు (ప్రస్తుత ఉపసర్పంచ్), భాకరపు శ్రీనివాస్ (మాజీ సర్పంచ్), బుద్దుల దేవేందర్, ఎకుల రాజు, ఎకుల చరణ్, బుద్దుల శ్రీధర్, జిణుక రాజు, జినుక అంజి, భాకరపు వేణు, బుద్దుల తిరుపతి (మాజీ ఉపసర్పంచ్), బుద్దుల మహేష్ తదితరులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

మహానీయుల చిత్రపటాలను అవమానించి, కులవివక్షకు పాల్పడుతున్న బాధ్యులందరినీ వెంటనే గుర్తించి, ఇలాంటి దుశ్చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని యువజన సంఘం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

-ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షుడు అక్నూరి రమేష్

Clip Adjustments