మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
మానేరు డ్యామ్ లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ఘనంగా బతుకమ్మ నిమజ్జనం
తెలంగాణ పండుగలకే తలమానికమైన సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్ నగరంలో ఎంతో వేడుకగా, అత్యంత వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ లో భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆదర్శ జై భీమ్ యూత్ క్లబ్, చైతన్య యూత్ క్లబ్, పెద్దమ్మ యూత్ క్లబ్, కపిలేశ్వరరస్వామి ఆలయం వద్ద, సాయి కృష్ణ థియేటర్ వద్ద మరియు రాంనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమీప ప్రాంతాల నుండి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధ రకాల రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, చప్పట్లతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడా రు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

అనంతరం లోయర్ మానేరు డ్యామ్ లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జనం పాయింట్ వద్ద బతుకమ్మలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, పూల పండుగ బతుకమ్మ ఒక దివ్యమైన ప్రతీక అని పేర్కొన్నారు. ఆడపడుచులందరూ ఒకే చోటికి చేరి ఐక్యతతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయాన్ని చాటిచెబుతోందన్నారు. భగత్ నగర్ లోని వివిధ వెల్ఫేర్ అసోసియేషన్లు, యూత్ క్లబ్‌లు కలిసి ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాజ రమ- శివరాం, పొన్నం లక్ష్మి- మొండయ్య గౌడ్, వివిధ యూత్ సంఘాల సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.