ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక బతుకమ్మ: బ్రహ్మశ్రీ పాములపర్తి వేణుగోపాల చారి

వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రకృతిని పూజిద్దాం విశిష్ట సాంస్కృతిని కాపాడదాం
తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో రామ్ నగర్ ప్రగతి నగర్ లో వెళ్లివేసిన ఆధ్యాత్మిక శోభ
తీరక్క పువ్వులతో గౌరమ్మను కొలిచి రాష్ట్ర శ్రేయస్సును ఆకాంక్షిస్తూ మహిళలు ప్రార్థనలు
సాంప్రదాయ వస్త్రధారణతో తరలివచ్చి బతుకమ్మ సంబరాలు అలరించిన మహిళామణులు
తెలంగాణ అడ్డా ప్రతినిధి కరీంనగర్ బ్యూరో:
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జిల్లాలోని రాంనగర్, ప్రగతి నగర్ పరిసరాల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగాయి. ఆదివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ పాములపర్తి వేణుగోపాల చారి మాట్లాడుతూ.. "ప్రపంచంలో ఎక్కడైనా దేవుళ్లను పువ్వులతో పూజించడం చూస్తాం, కానీ పువ్వులనే దైవంగా భావించి పూజించే ఏకైక అద్భుతమైన సంస్కృతి మన తెలంగాణది" అని కొనియాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రకృతి పట్ల ప్రేమ, మహిళల ఐక్యతకు ఇది సజీవ నిదర్శనమని అన్నారు.
తీరొక్క పూలైన గునుగు, తంగేడు, బంతి, చామంతి పూలతో గోపురాల రీతిలో అందంగా బతుకమ్మలను పేర్చి, "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అంటూ మహిళలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలతో రైతులు, సకల వ్యాపారాలతో వ్యాపారులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను వేడుకున్నారు.
ఈ వేడుకల్లో బ్రహ్మశ్రీ పాములపర్తి పద్మ - వేణుగోపాల చారి దంపతులతో పాటు కావ్య శ్రీ, వరుణ్ రాజ్, సాయి ప్రణీత, పృథ్వీరాజ్, స్వర్ణలత, శ్రీనివాసచారి, మమత, సుధాకర చారి మరియు స్థానిక కాలనీ మహిళలు, ఆడపడుచులు పాల్గొని సంబరాలను ఘనంగా ముగించారు.