Back to Home
Watermark
సోమవారం, 19 అక్టోబర్, 2026 TIME : 09:49 AM

బూరుగుపల్లిలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

Main Image

ఆటపాటలతో కోలాహలంగా సాగిన బతుకమ్మ సంబరాలు

మహిళల కోసం ప్రత్యేక లైటింగ్, తాగునీటి సదుపాయాలు

భక్తిశ్రద్ధలతో గౌరమ్మకు వీడ్కోలు పలికిన గ్రామస్తులు

చిత్రంలో: సద్దుల బతుకమ్మతో సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ కుటుంబం మరియు గ్రామ ప్రముఖులు 

సిరిసిల్ల స్టాప్ రిపోర్టర్ తెలంగాణ అడ్డా

Additional Image

బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పే ఈ వేడుకల కోసం స్థానిక సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ ముందస్తుగా అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేశారు.

గ్రామంలోని మహిళలు, యువతులు, చిన్నపిల్లలు రంగురంగుల పూలతో పేర్చిన అందమైన బతుకమ్మలతో తరలివచ్చి చప్పట్లు, పాటలతో కోలాహలం సృష్టించారు. బతుకమ్మ ఆడే మైదానంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక విద్యుత్ దీపాల (లైటింగ్) వ్యవస్థ, శుద్ధమైన తాగునీటి సౌకర్యం, మైక్ సౌండ్ సిస్టమ్స్ వంటి అన్ని వసతులను సర్పంచ్ ఆధ్వర్యంలో సమకూర్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ...

"తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలసి, ఐక్యమత్యంతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామంలోని మహిళలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాం. గ్రామ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు.

అనంతరం మహిళలంతా గౌరమ్మను పూజించి, స్థానిక చెరువు వద్ద బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేసి, ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Clip Adjustments