ఘనంగా బతుకమ్మ సంబురాలు.. పూల పండుగలో పాల్గొన్న కాంగ్రెస్ నేత సురుగు నాంపల్లి

1. తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ
2. కుటుంబ సమేతంగా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన వైనం
తెలంగాణ అడ్డా (సిరిసిల్ల స్టాఫ్ రిపోర్టర్):
తెలంగాణ ప్రజల సాంస్కృతిక ప్రతీక, ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ అయిన బతుకమ్మ సంబురాలు సిరిసిల్ల ప్రాంతంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సురుగు నాంపల్లి కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మను తలపై ఎత్తుకుని సాంప్రదాయ పద్ధతిలో వేడుకలను జరుపుకున్నారు. అనంతరం సురుగు నాంపల్లి మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, తీరొక్క పూలతో గౌరమ్మను కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణకే తలమానికమని కొనియాడారు. ఆడపడుచులు సంతోషంగా జరుపుకునే ఈ పండుగతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
నియోజకవర్గ ప్రజలందరిపై గౌరమ్మ చల్లని చూపు ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించారు.