మణుగూరులో తొలిసారి నవదుర్గ అఖండ జ్యోతి పూజ...
.jpg)
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఐలమ్మ నగర్ లో స్వయంభుగా కొలువై ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గా సహిత పెద్దమ్మ తల్లి జీవాలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అష్టమి, దుర్గావ తారం రోజున అమ్మవారికి ఘనంగా నవదుర్గల పూజ మరియు అఖండ జ్యోతి కార్యక్రమం రాపర్తి శ్రీహరి నాద్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఒకే పీఠంపై ఇద్దరు మహాశక్తులు కొలువు తీరని క్షేత్రమే ఈ జీవాలయము.
మణుగూరు చరిత్రలోనే మొట్టమొద టిసారిగా ఈ విధంగా నవదుర్గలరూ పంలో అమ్మవారిని అలంకరించి, అరటి చెట్టతో పడి మండపాన్ని నిర్మించి అఖండ జ్యోతిని వెలిగించ డం విశేషం. ఉదయం నుండి అమ్మ వారికి అభిషేకం,కుంకుమార్చన, చండీ పారాయణం,నవదుర్గా స్తోత్ర పఠనం నిర్వహించారు.సాయంత్రం భక్తుల సమక్షంలో అఖండ జ్యోతిని వెలిగించి, అమ్మవారికి ప్రత్యేక హార తులు ఇచ్చారు. శేషగిరిశర్మ (గిరి) పురోహితులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.వెంక టేశ్వర్ల గురు స్వామి అమ్మవారి పాటలతో అల రించారు.గీత ధర్మ ప్రచార సమితి సభ్యు లు ఆలయం వద్ద లలిత సహస్ర నామం, భగవద్గీత,హనుమాన్ చాలీసా పారాయ ణం చేశారు,ఈ కార్యక్రమానికి భక్తులు భవాని దీక్ష మాతలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు.అనంత రం భక్తులకు తీర్థప్ర సాదాలు,అల్పాహార వితరణ చేశారు.ఈ మహా జ్యోతి పూజలు భక్తులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా అమ్మవారి భజన కార్యక్రమంలో పూనకా లతో భక్తి పారవశ్యంతో తేలిఆడిన భక్తు లు.ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడు తూ,అమ్మవారి కృపతో మణుగూరులోనే మొదటి సారి ఇలాంటి విశిష్టమైన నవదుర్గ అఖండ జ్యోతి పూజను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది.భక్తుల సహకా రంతో ప్రతి ఏటా మరింత ఘనంగా నిర్వ హిస్తాం"అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాపర్తి శ్రీహరి నాథ్ గురు స్వామి మరియు భవాని మాతలు కమిటీ సభ్యులు,మహిళా భక్త మండలి సభ్యులు,ఐలమ్మ నగర్ వాసులు పాల్గొన్నారు.
