Back to Home
Watermark
సోమవారం, 19 అక్టోబర్, 2026 TIME : 10:48 PM

జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్ రివ్యూ

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

కొత్త నేర చట్టాలు, దసరా బందోబస్తు, ఈ-పెట్టీ కేసుల పురోగతిపై సీపీ సమీక్ష

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతం చేయాలని సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ సోమవారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో వారాంతపు నేర సమీక్ష (వీక్లీ క్రైమ్ రివ్యూ) సమావేశాన్ని నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో సీపీ జారీ చేసిన ప్రధాన ఆదేశాలు

కొత్త నేర చట్టాల అమలు: నూతనంగా అమల్లోకి వచ్చిన BNS, BNSS, BSA చట్టాల నిబంధనలను అధికారులు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, కేసుల నమోదు మరియు దర్యాప్తును పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

పటిష్ట దసరా బందోబస్తు: ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన నగరంలో, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు.

ఈ-పెట్టీ కేసులు & అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ: చిన్నపాటి నేరాలు, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఈ-పెట్టీ కేసుల్లో పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు: అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, క్రీడా పోటీలు మరియు వ్యాసరచన పోటీలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా విధులు నిర్వహించాలని సీపీ స్పష్టం చేశారు.

ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Clip Adjustments