Back to Home
Watermark
బుధవారం, 21 అక్టోబర్, 2026 TIME : 03:25 PM

ఎమ్మెల్యే పాయం ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తోలెం కళ్యాణి...

Main Image

శాలువ తో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

Additional Image

బూర్గంపాడు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తోలెం కళ్యాణి బుధవారం మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన బూర్గంపాడు మార్కె ట్ కమిటీ చైర్మన్ తోలెం కళ్యాణిని శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తోలెం కళ్యాణి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శాలువాతో సన్మా నించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తోలెం కళ్యాణికి నూతన బాధ్యతల సంద ర్భంగా అభినంద నలు తెలియజేస్తూ,రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ కమిటీ అభి వృద్ధిlకి కృషి చేయాలని ఆకాంక్షిం చారు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ,వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.కార్యక్ర మంలో మద్దెలసమ్మ య్య పొట్లపల్లి సర్పంచ్,మల్లేష్,తాల్ల గుట్టయ్య, పడిగ నాగయ్య మాజీ ఎం పి పి, తోలెం క్రిష్ణ,షేక్ మధార్,పడిగ వీర బాబు,కొమరం శ్రీను,తోలెం అర్జున్,బడే వెంకటేశ్వర్లు,తోలెం సర్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments