కోటి రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణం...

శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి ).

పినపాక నియోజకవర్గంలోని మణుగూరు సుందరయ్య నగర్, ఆదివాసి నగర్ ప్రాంతా ల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయా లు కల్పించే లక్ష్యంతో కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు గురువారం పినపాక ఎమ్మెల్యే,ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా ఆయా కాలనీ ల్లో రహదారి సౌకర్యాలు మెరుగుప డటంతో పాటు,వర్షాకాలంలో నీరు నిలిచి పోవడం, మురుగునీటి పారుదలకు సంబం ధించిన సమస్య లు తగ్గే అవకాశం ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి,కాలనీల అభివృద్ధికి అవసర మైన మౌలిక వసతులు కల్పించేందుకు ఈ పనులు దోహద పడనున్నాయి.పినపాక నియోజక వర్గ అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తూ గ్రామాలు,పట్టణాల్లో రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థలు,ఇతర మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ప్రజల అవస రాలను గుర్తించి, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సుందరయ్య నగర్,ఆదివాసి నగర్ ప్రాంతాల్లో చేపట్టనున్న ఈ పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యా లు అందుబాటులోకి రావడంతో పాటు, పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడ తాయ ని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతిని ధులు, సంబంధిత అధికారులు, ప్రజా నాయకులు,కార్యకర్తలు,కాలనీ ప్రజలు పాల్గొననున్నారు.