Back to Home
Watermark
శనివారం, 24 అక్టోబర్, 2026 TIME : 06:28 PM

కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా జలాలుద్దీన్ అక్బర్ బాధ్యతల స్వీకరణ

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

నూతన DMWOని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకులు

పదేళ్ల తర్వాత మైనారిటీ అధికారి నియామకంపై హర్షం మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు

కరీంనగర్ జిల్లా నూతన మైనారిటీ సంక్షేమ అధికారిగా (DMWO) జలాలుద్దీన్ అక్బర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకులు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా అదనపు డీఆర్ఓ (In-charge Adl. DROs)లకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మైనారిటీ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీ వర్గానికి చెందిన పూర్తిస్థాయి అధికారిని కరీంనగర్ DMWOగా నియమించడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు.

ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలకు కరీంనగర్ ముస్లిం మైనారిటీల పక్షాన, కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ విభాగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నేహాల్ అహ్మద్, డీసీసీ అధికార ప్రతినిధి జమీల్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాబాజ్, అర్బన్ డీసీసీ అధికార ప్రతినిధి మహమ్మద్ అమీర్, నాయకులు చాంద్, ఆరిఫ్, అబ్దుల్ బారీ, అజ్మత్, సలీం భాయ్, జాఫర్, ముఫ్తీ సాబ్, సద్దాం, సర్వర్ ఖాన్, సాదిక్ భాయ్, వాజిద్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments