ఒగ్గు పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కరీంనగర్లో 'తెలంగాణ చౌక్ నుండి కళాభారతి' వరకు భారీ ర్యాలీ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్
ప్రత్యేక కార్పొరేషన్, రూ.5,000 పింఛన్, పోలీసుల వేధింపులు ఆపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్
తెలంగాణ శ్రీ మల్లికార్జున స్వామి యాదవ ఒగ్గు పూజార్ల సుదీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరంలో సోమవారం 'శ్రీ మల్లికార్జున స్వామి యాదవ ఒగ్గు పూజారుల సంక్షేమ సంఘం' ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కళాభారతి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి యాదవ ఒగ్గు పూజారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాల్వ మనోజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ దైవసేవలో తరిస్తున్న ఒగ్గు కళాకారుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.
ఒగ్గు పూజారుల ప్రధాన డిమాండ్లు ఇవే

కార్పొరేషన్ ఏర్పాటు: యాదవ ఒగ్గు పూజార్ల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
పింఛన్ & హెల్త్ కార్డలు: అర్హులైన ఒగ్గు కళాకారులకు ప్రతినెలా రూ. 5,000 పింఛన్ అందించడంతో పాటు, ఉచిత ఆరోగ్య భద్రత (హెల్త్) కార్డులు మంజూరు చేయాలి.
సొంత భవనాలకు స్థలం: ప్రతీ జిల్లా కేంద్రంలో యాదవ ఒగ్గు కళాకారుల భవన నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలి.
దేవాలయాల్లో ప్రాతినిధ్యం: మల్లికార్జున స్వామి దేవాలయాలలో రాత్రింబవళ్లు సేవలందిస్తున్న ఒగ్గు కళాకారులు, పూజారులకు దేవాలయ ట్రస్ట్ బోర్డులలో చైర్మన్ మరియు డైరెక్టర్ పదవులు కేటాయించాలి.
ఉపాధి & సబ్సిడీ ఆటోలు: పేద ఒగ్గు కళాకారుల జీవనోపాధి కోసం సబ్సిడీ కింద ఆటోలు మంజూరు చేయాలి.గుర్తింపు కార్డులు & పోలీసుల వేధింపుల నిలిపివేత: 24 గంటలు విధుల్లో భాగముగా రోడ్లపై ప్రయాణించే ఒగ్గు కళాకారులకు అధికారిక గుర్తింపు కార్డులు (ID Cards) ఇవ్వాలని, రాత్రిపూట కళాకారులపై జరుగుతున్న పోలీసుల వేధింపులను తక్షణమే నిలిపివేయాలని నిలదీశారు.ఈ భారీ ర్యాలీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావటి భూమయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డేగ రమేష్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్, అఖిలభారత యాదవ మహాసభ జాతీయ నాయకుడు సందెవేణి మహేంద్ర నాథ్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ యాదవ్, మొక్కపల్లి రాజ మల్లయ్య యాదవ్, కట్టెల రామన్న యాదవ్, వెంకన్న యాదవ్, తాటికొండ సత్తయ్య యాదవ్, మల్లన్న కొమురయ్య, కొడిమ్యాల మల్లన్న యాదవ్, మల్లేశం యాదవ్, చేకూరి లింగం యాదవ్, కావటి శ్రీశైలం యాదవ్, నర్రా సతీష్ యాదవ్, సంధ్య వేణి ప్రసాద్ యాదవ్, వాసం మల్లేశం యాదవ్, ఆవుల మల్లేశం యాదవ్ తదితర నాయకులు, ఒగ్గు పూజారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.