Back to Home
Watermark
సోమవారం, 26 అక్టోబర్, 2026 TIME : 08:57 PM

బీరంగూడ డివిజన్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. పార్టీ అభివృద్ధికి శ్రమిస్తా: ఈర్ల రాజు ముదిరాజ్

Main Image

జిన్నారం మండల్, తెలంగాణ అడ్డా ప్రతినిధి:

పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండలం పరిధిలోని బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఈర్ల రాజు ముదిరాజ్‌ను కిష్టారెడ్డిపేట్‌లోని రెయిన్బో మెడోస్ కాలనీ సొసైటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాలనీ సొసైటీ నాయకులు నూతన బాధ్యతలు చేపట్టిన ఈర్ల రాజు ముదిరాజ్‌ను అభినందించారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ తనపై అభిమానం చూపించి సన్మానించిన రెయిన్బో మెడోస్ కాలనీ సొసైటీ నాయకులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

బీరంగూడ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. డివిజన్ పరిధిలోని కాలనీలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం కల్పించి ఐక్యంగా ముందుకు సాగుతానని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో బీరంగూడ డివిజన్‌లో బీజేపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల సహకారంతో డివిజన్‌లో కమలం జెండా ఎగురవేయడానికి కృషి చేస్తానని ఈర్ల రాజు ముదిరాజ్ స్పష్టం చేశారు.

సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు: రెయిన్బో మెడోస్ కాలనీ మాజీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ చౌదరి, ట్రెజరర్ ఉమామహేశ్వర్, జాయింట్ సెక్రటరీ మురళి, మాజీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, బీజేపీ నాయకులు విశ్వనాథం, సృజన్ గౌడ్, అనిల్, ప్రవీణ్ కుమార్, డి. అనిల్ కుమార్, వెంకటేష్, సంతోష్ కుమార్, సుధీర్, సతీష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments