Back to Home
Watermark
మంగళవారం, 27 అక్టోబర్, 2026 TIME : 08:27 AM

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గంజివాగు వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ.10 లక్షలు మంజూరు: ఉత్తర్వులు జారీ

Main Image

తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి:

బోయినిపల్లి నుండి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిలోని గంజివాగు వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా సీసీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) గారి ప్రత్యేక చొరవ తో రూ. 10 లక్షల నిధులను మంజూరు అయ్యాయి. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రొసీడింగ్స్ (Proc No: A8/333/2026-46) ఉత్తర్వులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాల మేరకు అధికారులు అధికారికంగా విడుదల చేశారు. 

బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గంజివాగుపై ఇటీవల నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. అయితే వంతెనకు ఇరువైపులా సరైన అనుసంధాన రహదారి (అప్రోచ్ రోడ్డు) లేకపోవడంతో ఈ సమస్యను స్థానిక నేతల ద్వారా తెలుసుకుని నిధుల మంజూరుకు కృషి చేశారు. ప్రజల ఇబ్బందులపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు, యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Additional Image

ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు MGNREGS (VB G RAM G) కింద రూ. 10 లక్షల వ్యయంతో ప్రతిపాదనలు పంపగా, జిల్లా యంత్రాంగం వేగంగా పరిశీలించి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

వంతెన అప్రోచ్ రోడ్డు సమస్యను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే సత్యం గారికి, స్తంభంపల్లి గ్రామస్తులతో పాటు మండల ప్రజలు, వాహనదారులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

Clip Adjustments