Back to Home
Watermark
శుక్రవారం, 30 అక్టోబర్, 2026 TIME : 08:53 PM

ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకుల డిమాండ్

Main Image

విశ్వకర్మలకు సామాజిక న్యాయం కల్పించాలి

కరీంనగర్, తెలంగాణ అడ్డా:

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం కల్పించాలని, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మశ్రీ పాములపర్తి వేణుగోపాల చారి అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన సంఘం సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలకు చెందిన సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొని విశ్వకర్మ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

Additional Image

ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ లోన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని, విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని నాయకులు కోరారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, 55 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశ్వకర్మల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాలికోజు నరసింహ చారి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాంపల్లి సోమచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రోజు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసిపేట మురళి, నాగుర్ల మురళి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు చాన గుండ నరేష్ పాల్గొన్నారు.

అలాగే కరీంనగర్ జిల్లా మండలాల అధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, మాయోజుల వెంకటేశ్వర్లు, శ్రీమంతుల శ్రీనివాస్, గోగులకొండ సత్యనారాయణ, శ్రీరామోజు రామ్మూర్తి, హనుమంత చారి, జూపాక ఆంజనేయులు, పాములపర్తి రవీంద్ర చారి, మల్లాచారితో పాటు జవ్వాజి వెంకటలక్ష్మి, బీజాళ్ళ సుజాత, ఇమ్మడోజు భాగ్యలక్ష్మి, స్వరూప, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బిమోజు సురేంద్ర చారి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చందనగిరి గోపాల్, ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం, కోశాధికారి కొలకాని శంకర్, శ్రీమంతుల సదాచారి తదితరులు హాజరయ్యారు.

విశ్వకర్మల ఐక్యత, హక్కుల సాధన, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో విశ్వకర్మలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Clip Adjustments