బూరుగుపల్లికి మినీ బస్టాప్ మంజూరు: కలెక్టర్ గరిమ అగర్వాల్ ఉత్తర్వులు

నెరవేరిన ఎన్నికల హామీ: కలెక్టర్‌ను కలిసి విన్నవించిన సర్పంచ్ సౌమ్య మహేష్
ప్రయాణికుల ఇబ్బందులను తీర్చేందుకు సత్వర చర్యలు
సర్పంచ్ కృషికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు
బూరుగుపల్లి / సిరిసిల్ల, తెలంగాణ అడ్డా:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల చిరకాల స్వప్నమైన మినీ బస్టాప్ నిర్మాణానికి మోక్షం లభించింది. గ్రామంలో మినీ బస్టాప్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగర్వాల్ గారు అధికారిక ఉత్తర్వులు (Proc. No. C2/615/2026) జారీ చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ పెంచల సౌమ్య మహేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలో ప్రయాణికులు, విద్యార్థులు ఎండనక, వాననక పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సాండ్ ఫండ్ (Sand Fund) నుంచి రూ. 1.00 లక్ష నిధులను మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 15 రోజుల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని బోయినిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO)ని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నిలబెట్టుకుంటూ, బూరుగుపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ పెంచల సౌమ్య మహేష్‌పై గ్రామస్తులు, యువకులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.