Back to Home
Watermark
శనివారం, 31 అక్టోబర్, 2026 TIME : 10:09 AM

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్

Main Image

ఓటు హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు

బోయినిపల్లి, తెలంగాణ అడ్డా ప్రతినిధి:

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు చోరీకి వ్యతిరేకంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ యాత్రను సంగీతం శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రత్యేక బస్సుల ద్వారా కాంగ్రెస్ శ్రేణులు రాజధానికి పయనమయ్యాయి.

Additional Image

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల వ్యవస్థను, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, వినోద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భరత్ రెడ్డి, బోయిని వేణు, రజనీకాంత్‌తో పాటు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ ఢిల్లీకి తరలివెళ్లారు.

Clip Adjustments