ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే

ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే
550 ఎకరాల భూమిని కోర్టు ద్వారా సాధించిన ఘనత మాదే
పది సంవత్సరాల కాలంలో అనుచరులకు అప్పనంగా భూమి ఇచ్చింది టిఆర్ఎస్ నాయకులు
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 31 తెలంగాణ అడ్డా
హైదరాబాద్ అసెంబ్లీ సిఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ 550 ఎకరాల భూమిని కోర్టులో న్యాయబద్దంగా సాధించి తెలంగాణ రాష్ట్ర లక్షల కోట్ల ఆస్తిని కాపాడారని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. 1 లక్ష 50 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం పరిరక్షించిందని హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి లోని పలు ప్రాంతాలు ఉప్పలగూడ, కంటోన్మెంట్, రాయదుర్గం భూములను కాపాడి నేడు కురిసిన వర్షాలతో చెరువులు కుంటలుకళకళలాడుతున్నాయని అన్నారు. నేడు ఎకరానికి 100 కోట్లు విలువ చేసే భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టులో తన మేధాశక్తితో రాష్ట్రానికి సాధించి తీసుకువచ్చారని వివరించారు. టిఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర రావు, మంత్రి హరీష్ రావులు తమ అనుచరులకు ప్రభుత్వ భూములను అప్పనంగా తక్కువ ధరలకు వారి పార్టీ వారికి ఇచ్చిన చరిత్ర వారిది అని ఎద్దేవా చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నేడు వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరిందని అన్నారు. బిఆర్ఎస్ నాయకులైన దామోదర్ రావు ను ముందు పెట్టి అటవీ భూములను, విలువైన భూములను నిర్వీర్యం చేసిన చరిత్ర బిఆర్ఎస్ ది అని అన్నారు.
నేడు రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిపై అవాకులు చవాకులు పేలడం బి.ఆర్.ఎస్ నాయకులకు ఎంతవరకు సమంజసమని రాష్ట్ర సంపదను కాపాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక అర్థం లేని మాటలు మాట్లాడటం హీనమైన చర్య అని విమర్శించారు.