ఆసిఫాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన గొర్రెల కాపరి

ఎలుగుబంట్ల దాడిలో మేకల కాపరికి తీవ్ర గాయాలు మూడు ఎలుగుబంట్లతో ఒంటరిగా పోరాడి ప్రాణాలతో బయటపడిన శంకర్‌ తీవ్ర రక్తస్రావంతో 3 కిలోమీటర్లు నడిచి గ్రామానికి చేరిక పరిస్థితి విషమం.. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలింపు తిర్యాణి తెలంగాణ అడ్డా ప్రతినిధి, సెప్టెంబర్ 4: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మేకలు మేపేందుకు అడవికి వెళ్లిన వ్యక్తిపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేయడం కలకలం రేపింది. ఎలుగుబంట్లతో ఒంటరిగా పోరాడి ప్రాణాలతో బయటపడిన బాధితుడు తీవ్ర గాయాలతో సుమారు మూడు కిలోమీటర్లు పడుతూ లేస్తూ నడిచి గ్రామానికి చేరుకున్నాడు. తిర్యాణి మండలం రోంపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోంపల్లి పంచాయతీ పరిధిలోని...