కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బిఆర్ఎస్ వంటావార్పు నిరసన
మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ‘వంటా వార్పు’ నిరసన ప్రభుత్వ హామీల అమలుకు మహిళల పక్షాన పోరాటం కొనసాగిస్తాం: గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని, రాబోయే రోజుల్లో ప్రజలే ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘వంటా వార్పు’ నిరసన కార్యక్రమం నిర్వహించారు....