సారంగాపూర్ లో టిఆర్ఎస్ భారీ నిరసన
సారంగాపూర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ పెంబట్లలో వంటా-వార్పు.. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ఆగ్రహం జగిత్యాల ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెంబట్ల గ్రామ శివారు నుంచి రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా ర్యాలీ చేపట్టారు. చేతుల్లో బీఆర్ఎస్ జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదిస్తూ ర్యాలీ కొనసాగించారు. అనంతరం రోడ్డుపై...