సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు తుగ్లక్ సైతం సిగ్గుపడేలా ఉన్నాయి

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు తుగ్లక్ సైతం సిగ్గుపడేలా ఉన్నాయి ప్రభుత్వ నిర్ణయాల్లో పొంతన లేదు.. టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ సైతం సిగ్గుపడే పరిస్థితి ఉందని టీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి ఒకటి చెబుతుంటే.. ప్రభుత్వ శాఖలు మరోలా ప్రకటనలు చేయడం రాష్ట్రంలో పాలనా గందరగోళానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. ఇంటర్మీడియేట్ ప్రవేశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు తీసుకోబోమని చెబుతున్నారని, అయితే కేవలం రెండు రోజుల్లోనే ఇంటర్మీడియేట్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ బోర్డు...