యాదవుల ఐక్యతకు ప్రతీకగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

యాదవుల ఐక్యతకు ప్రతీకగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కరీంనగర్, సెప్టెంబర్ 4 (తెలంగాణ అడ్డా): అఖిల భారత యాదవ మహాసభ – కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం కరీంనగర్ యాదవ ట్రస్ట్ భవన్‌లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకల్లో యాదవ సోదర సోదరీమణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి, యాదవ సమాజం సుఖసంతోషాలతో, ఐకమత్యంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. యువత, మహిళలు, యాదవ సంఘం సభ్యులు...