వివాహ వేడుకకు హాజరైన చల్మెడ లక్ష్మీనరసింహారావు

వివాహ వేడుకకు హాజరైన చల్మెడ లక్ష్మీనరసింహారావు కోనరావుపేట, సెప్టెంబర్ 4 (తెలంగాణ అడ్డా): కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన సర్పంచ్ కుంటెల్లి నాగరాజు సోదరుని వివాహ వేడుక అగ్రహారం శ్రీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, కాశవేణి మహేష్, మాసం సుమన్, మాసం బాబు, అన్వేష్, శివతేజ, గణేష్, గిరి బాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.