బోయిన్పల్లి లో వెయ్యి రోజుల కాంగ్రెస్ అసమర్ధ పాలనపై బిఆర్ఎస్ నిరసన

బోయినిపల్లిలో వెయ్యి రోజుల అసమర్థ పాలనపై బీఆర్ఎస్ నిరసన వంటా వార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం బోయినిపల్లి, సెప్టెంబర్ 4 (తెలంగాణ అడ్డా): కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినిపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు వంటా వార్పు కార్యక్రమం చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. మహిళలు, రైతులు, యువత, పేదల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...