ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు టేక్మాల్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: టేక్మాల్ మండల పరిధిలోని సాలోజిపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన ఐదు అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వనుల నడుమ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా గత మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాది కార్యక్రమాలు నిర్వహించారు. నిర్ణీత ముహూర్త సమయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో పాటు యంత్ర స్థాపన కార్యక్రమాలను...