కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ‘అల్ఫోర్స్’ డా. వి. నరేందర్ రెడ్డి కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘అల్ఫోర్స్’ డా. వి. నరేందర్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి...