భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న ఐలాపూర్ మాణిక్ యాదవ్
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఐలాపూర్ మాణిక్ యాదవ్ తెలంగాణ అడ్డా ప్రతినిధి పటాన్‌చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొని శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, స్థానిక ప్రజలతో ఆయన ఆత్మీయంగా మమేకమై, వారితో కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితం ప్రతి ఒక్కరికీ గొప్ప సందేశాన్ని అందిస్తుందని మాణిక్ యాదవ్ పేర్కొన్నారు. ధర్మం కోసం నిలబడటం, అధర్మాన్ని ఎదిరించడం, సత్యాన్ని కాపాడటం, ఎన్ని...