కరీంనగర్ కాంగ్రెస్ లో వర్గ పోరు భగుమంటుందా
కరీంనగర్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంటోందా? జిల్లా ఇంచార్జ్ వెల్చల్ల రాజేందర్ గైర్హాజరు వెనుక అసలు కథేంటి? కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా కరీంనగర్ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ జిల్లా ఇంచార్జ్‌గా కొనసాగుతున్న వెల్చల్ల రాజేందర్ నగరంలోనే ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నిర్వహించిన కీలక బైక్ ర్యాలీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇంచార్జ్ హోదాలో ఉన్న నేతే పార్టీ అధికారిక కార్యక్రమానికి దూరంగా ఉండటానికి కారణమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, పాలన వంద రోజుల ప్రగతి క్యాలెండర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కరీంనగర్‌లో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ...