ఆరేపల్లి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఆరెపల్లి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అల్లాడి రమేష్ పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న డాక్టర్ మనోహర్ భగవద్గీత బోధనలు మానవాళికి ఆదర్శనీయం: అల్లాడి రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి / తెలంగాణ అడ్డా: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లిలోని శ్రీకృష్ణ చైతన్య మఠం (ఇస్కాన్ ఆలయం)లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. మనోహర్...