పండగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు

ధర్మ పరిరక్షణకు ప్రతీక శ్రీకృష్ణుడు పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి: నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు జిన్నారం ప్రతినిధి తెలంగాణ అడ్డా: శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ పరిరక్షణకు, సత్యానికి ప్రతీకగా నిలిచారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. పండుగలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీతో పాటు పటాన్‌చెరు పట్టణంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...