కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా ఘోర ప్రమాదం 13 మంది ప్రయాణికులు.. పలువురికి గాయాలు కామారెడ్డి ప్రతినిధి / తెలంగాణ అడ్డా కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలో రక్షణ గోడను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో...