పెద్దమ్మ గూడెంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

పెద్దమ్మగూడెంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గోమాత సేవతో పాటు భజనల్లో పాల్గొన్న భక్తులు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్న కౌన్సిలర్ శిల్పా నాగరాజు యాదవ్ జిన్నారం ప్రతినిధి / తెలంగాణ అడ్డా సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పెద్దమ్మగూడెం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామ ప్రజలు, యువకులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిష్టా నియమాలతో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనంతరం గోమాత సేవా కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులు భజన పాటలు పాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 5వ వార్డు కౌన్సిలర్ శిల్పా నాగరాజు యాదవ్ ముఖ్యఅతిథిగా...