వేములవాడలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్
వేములవాడలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు వేములవాడ ప్రతినిధి / తెలంగాణ అడ్డా వేములవాడ పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఏ.టి. యాదవ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు వాసం మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం,...