రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారం

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్‌దే అధికారం ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ అడ్డా ప్రతినిధి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీలను ప్రాతిపదికగా చేసుకుని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ...