ఎలిగేడులో గంజాయి సేవించిన ఏడుగురు యువకులను గుర్తించి డి అడిక్షన్ కేంద్రానికి తరలించిన పోలీసులు
ఎలిగేడ్‌లో గంజాయి సేవించిన ఏడుగురు యువకుల గుర్తింపు డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించేందుకు పోలీసుల చర్యలు రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గంజాయి వినియోగం, అక్రమ రవాణా, సరఫరా, నిల్వపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో ఎస్‌ఐ లక్ష్మణ్, ఎలిగేడ్ ఎస్‌ఐ మధుకర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్దపల్లి జోన్‌లోని ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందం, ఎలిగేడ్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఎలిగేడ్ గ్రామ కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు గుర్తించి అదుపులోకి...