ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువుల సేవలు వెలకట్టలేనివి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ఉపాధ్యాయుడు సమాజంలో మార్పుకు నాంది పలికే శక్తి అని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో పలు క్యాంపస్‌లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్, భగత్‌నగర్ అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్, మంకమ్మతోటలోని అల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్, వావిలాలపల్లిలోని టైనీ టాట్స్, ఎస్6...