కరీంనగర్ లో తీవ్రమైన జరాలు ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని కోరుతున్న నగరవాసులు
కరీంనగర్‌లో తీవ్రమైన జ్వరాలు.. ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేయాలి ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ కరీంనగర్ పార్లమెంట్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కరీంనగర్ జిల్లాలో జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య శాఖను సిద్ధం చేయాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల...