హైదరాబాద్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 113 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం హైదరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టెయిన్లీ గర్ల్స్ హైస్కూల్లో హైదరాబాద్ జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా రంగానికి విశిష్ట సేవలందించిన 113 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తదితర అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు...