అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి.. పెద్దపల్లిలో ఘనంగా సంబరాలు పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో పట్టణంలోని చీకురాయి రోడ్డు నుంచి జెండా చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ...