రైతులకు కరెంట్, సాగునీటి కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుబ్బాకలో మండిపడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
రైతులకు కరెంట్, సాగునీటి కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుబ్బాకలో మండిపడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ‘రైతు పొలికేక’ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సిద్దిపేట ప్రతినిధి / తెలంగాణ అడ్డా: దుబ్బాక నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు పొలికేక’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రజలు రోడ్డెక్కి వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని,...