కరీంనగర్‌లో ఘనంగా ‘యువ సమరభేరి’ సదస్సు
కరీంనగర్‌లో ఘనంగా ‘యువ సమరభేరి’ సదస్సు కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ సమరభేరి’ (జెన్ జెడ్) సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగాలు, విద్య, భవిష్యత్ అవకాశాల కోసం యువతకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు శాంతియుతంగా నిరసన...