ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి

ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి సెప్టెంబర్ 10న రాష్ట్రవ్యాప్త కార్యక్రమం.. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ పిలుపు కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారుల దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో రాష్ట్ర జేఏసీ రూపొందించిన ‘చలో హైదరాబాద్’ పోస్టర్‌ను విడుదల చేశారు....