ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి
ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి విద్యార్థులు చెడు వ్యసనాలకు, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్‌లోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీపీసీ టీటీఎస్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకుమార్, సైబర్ నేరాల విభాగం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ...