ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి అధికారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం వేములవాడ ప్రతినిధి / తెలంగాణ అడ్డా ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణలో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా నో మ్యాపింగ్ ఓటర్లు, అనామలీస్ ఓటర్ల వివరాలతో పాటు నూతన ఓటర్ల దరఖాస్తులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలో మొత్తం 1,217 మంది నో...