కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు విడ్డూరం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు విడ్డూరం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మాట అటుంచితే, గత బీఆర్ఎస్ పాలకులు కనీసం రేషన్ కార్డుల్లో అదనపు పేర్లను నమోదు చేయడం, తప్పుల సవరణలు కూడా చేయలేకపోయారని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. అలాంటి వారు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్ కన్వెన్షన్‌లో మండలానికి చెందిన 100 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 53 మంది లబ్ధిదారులకు...