బోయిన్పల్లిలో అర్ధరాత్రి యాప్‌లో స్టాక్‌ నమోదు.. అసలు మతలబేంటి?

యూరియా బస్తాలు ఉదయానికా.. అర్ధరాత్రి యాప్‌లోకా? బోయిన్పల్లిలో అర్ధరాత్రి యాప్‌లో స్టాక్‌ నమోదు.. అసలు మతలబేంటి? రైతులకు అందాల్సిన యూరియాపై అనుమానాలు.. అధికారుల తనిఖీలకు డిమాండ్ బోయిన్పల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా బోయిన్పల్లి మండల కేంద్రంలోని కొన్ని ఫెర్టిలైజర్ షాపులు, ఫ్యాక్స్ సెంటర్లలో యూరియా బస్తాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదయం రైతులకు అందుబాటులో ఉంచాల్సిన యూరియా బస్తాలను అర్ధరాత్రి వేళల్లో యాప్‌లో నమోదు చేయడం వెనుక అసలు కారణమేంటన్న ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. పగటి సమయంలో యూరియా కోసం రైతులు షాపుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో.. రాత్రివేళల్లో మాత్రం యాప్‌లో స్టాక్‌ నమోదు చేయడం ఎందుకు? యాప్‌లో నమోదు...