జిన్నారం మున్సిపల్‌లో కాంగ్రెస్ 420 హామీల బాకీ కార్డుల పంపిణీ
జిన్నారం మున్సిపల్‌లో కాంగ్రెస్ 420 హామీల బాకీ కార్డుల పంపిణీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి జిన్నారం మున్సిపల్ బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ జిన్నారం ప్రతినిధి / తెలంగాణ అడ్డా జిన్నారం మున్సిపల్ పరిధిలోని నల్తూర్, కొడకంచి, ఉట్ల, దాదిగూడెం, మంగంపేట, జంగంపేట గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన 420 బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేస్తూ ఇంటింటికీ...