మంగంపేటలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్‌ బాకీ కార్డుల పంపిణీ

మంగంపేటలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్‌ బాకీ కార్డుల పంపిణీ జిన్నారం మండల ప్రతినిధి / తెలంగాణ అడ్డా జిన్నారం మండలంలోని మంగంపేట గ్రామంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానాలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు ఇంటింటికీ కాంగ్రెస్‌ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మున్సిపాలిటీ చైర్మన్‌ జనార్ధన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జిన్నారం బీఆర్ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు నాయకోటి రాజేష్‌, మండల నాయకులు, మంగంపేట గ్రామ బీఆర్ఎస్‌ నాయకులు ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డులను పంపిణీ చేశారు....