మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

పర్యావరణ పరిరక్షణకు విత్తన గణపతి ఎంతో ఉపయోగకరం మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చొప్పదండి ప్రతినిధి / తెలంగాణ అడ్డా మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రూపొందించిన విత్తన గణపతిని చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జోగినిపల్లి సంతోష్‌కుమార్ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని చేస్తున్న అవగాహన కార్యక్రమం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు....