శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఘనంగా శ్రావణ మాస ఉత్సవాలు

శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఘనంగా శ్రావణ మాస ఉత్సవాలు పాల్వంచ ప్రతినిధి / తెలంగాణ అడ్డా పాల్వంచ పట్టణ పరిధిలోని గాంధీనగర్ 5వ వార్డు, 44వ డివిజన్‌లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. 1951 సంవత్సరంలో పెద్దపాలు చెట్టు కింద వేంచేసిన అమ్మవారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా శ్రావణమాసం 23వ రోజు, నాలుగో ఆదివారం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి బియ్యం, పప్పు, బెల్లం, పసుపు, కుంకుమ తదితర సామగ్రిని సేకరించి మట్టి కుండలో ప్రత్యేకంగా...